హోలీ పండుగ .. చంద్రగ్రహణం ఒకే రోజు.. హోలీ ఆడొచ్చా.. ఆడకూడదా.. సెలబ్రేషన్స్ ఎప్పుడు జరుపుకోవాలి..!

హోలీ పండుగ .. చంద్రగ్రహణం ఒకే రోజు.. హోలీ ఆడొచ్చా.. ఆడకూడదా.. సెలబ్రేషన్స్ ఎప్పుడు జరుపుకోవాలి..!

దేశవ్యాప్తంగా ఎంతో ఉత్సాహంగా జరుపుకునే రంగుల పండుగ హోలీ తేదీ ఈ ఏడాది ( 2026) మార్చి 3 వ తేది వచ్చింది.  అదే చంద్రగ్రహణం ఏర్పడటంతో హోలీ సెలబ్రేషన్స్​ జరుపుకోవచ్చా.. జరుపుకోకూడదా.. మరి ఎప్పుడు రంగుల జల్లుకుంటూ హోళీ సెలబ్రేషన్స్​ చేసుకోవాలి.. ఈ విషయం గురించి పండితులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం... 

హోలీ పండుగ.. సెలబ్రేషన్స్​ విషయంలో ప్రజలు గందరగోళంగా ఉన్నారు.  మార్చి 3 వ తేది.. హోలీ పండుగ.. చంద్రగ్రహణం  ఒకే రోజు వచ్చాయి. గా హోలీని మార్చి 3న జరుపుకోవాలా లేదా మార్చి 4న నిర్వహించాలా అనే సందేహానికి  పండితులు, జ్యోతిష్య నిపుణులు పంచాంగాల ఆధారంగా స్పష్టత ఇచ్చారు. 

పండితులు తెలిపిన వివరాల ప్రకారం ఈ ఏడాది హోలీ వేడుకలు రెండు రోజులుగా చేసుకోవాలి.  సంప్రదాయం ప్రకారం మొదటి రోజు హోలికా దహనం, రెండో రోజు రంగుల హోలీ జరుపుకోవడం ఆనవాయితీగా కొనసాగుతోంది.

పంచాంగం ప్రకారం హోలీ పండుగకు సంబంధించిన ఫాల్గుణ పౌర్ణమి తిథి మార్చి 2 సాయంత్రం 5:55 గంటలకు ప్రారంభమై మార్చి 3 సాయంత్రం 5:07 గంటల వరకు కొనసాగుతుంది. పౌర్ణమి తిథి ఆధారంగానే హోలికా దహనం నిర్వహించాలని శాస్త్రాల ద్వారా తెలుస్తుంది. అందువల్ల హోలికా దహనాన్ని మార్చి 2వ తేదీ సాయంత్రం 6.22 గంటల నుంచి రాత్రి 8.50 గంటల వరకు  నిర్వహించాలని పండితులు చెబుతున్నారు.

 హోలికా దహనం చెడు మీద మంచి విజయం సాధించిన సంకేతంగా భావించబడుతుంది.ప్రజలు చెడు ఆలోచనలు, నెగటివ్ శక్తులను దూరం చేయాలని సంకల్పంతో అగ్నికి ప్రదక్షిణలు చేస్తారు.

►ALSO READ | Vastu Tips:  పేరును బట్టి వాస్తు ఉంటుందా.. ఇంటి స్థలానికి మూడు దిక్కుల్లో రోడ్లు ఉంటే నష్టాలొస్తాయా..!

 ఈఏడాది ( 2026)  మార్చి 3న చంద్రగ్రహణం  ఏర్పడుతుంది. గ్రహణ సమయంలో ఎలాంటి పూజలు.. సంబరాలు  చేయకూడదని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా రంగులతో ఆడుకునే ప్రధాన హోలీ వేడుకలు గ్రహణం ప్రభావం లేకుండా జరుపుకోవాలని సూచిస్తున్నారు.  గ్రహణం సమయంలో మంత్రాలకు ఎంతో శక్తి ఉంటుంది.  ఆ సమయంలో  చేసే జపం.. అనుష్టానం.. మొదలైన వాటికి వేల రెట్లు ఫలితం ఉంటుంది.  ఆసమయంలో గ్రహాల శక్తి చాలా ఎక్కువుగా ఉంటుంది.   చంద్రగ్రహణం.. హోలీ పండుగ ఒకే రోజు వచ్చినందున  రంగుల హోలీని మార్చి 4న జరుపుకోవాలని పండితులు స్పష్టం చేస్తున్నారు.

హోలీ పండుగ రోజే వసంత రుతువు ప్రారంభమవుతుంది. ఉత్తర భారతదేశంలో ఈ పండుగకు చాలా విశిష్టత ఉంది.  ఇప్పుడు దక్షిణ భారతదేశంలో కూడా అత్యంత వైభవంగా జరుపుకుంటున్నారు.  కుటుంబ సభ్యులు, స్నేహితులు కలిసి రంగులు చల్లుకుంటూ సెలబ్రేషన్స్​ చేసుకుంటున్నారు.  హోలీ సంబరాలకు చంద్రగ్రహణం ఎఫెక్ట్​ పడకుండా మార్చి 4 వ తేదీన జరుపుకోవాలని పండితులు చెబుతున్నారు. 

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని పండితులు, జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న  సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.